ఏపీ లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఒక శుభవార్త:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని ఏపీ ఆదర్శ పాఠశాలల్లో ఎనిమిదవ (8వ) తరగతి చదువుతూ, కుటుంబ వార్షిక ఆదాయం 3,50,000 రూపాయలు లోపు ఉన్న విద్యార్థులకు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డాక్టర్ శ్రీ కే. వి. శ్రీనివాసుల రెడ్డి గారు తాజాగా ఒక ప్రకటనలో తెలియజేసారు..
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేసుకొనుటకు ప్రారంభ తేది : సెప్టెంబర్ 4,2025.
దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేది : సెప్టెంబర్ 30,2025.
NMMS పరీక్ష నిర్వహణ తేది : డిసెంబర్ 7, 2025.
దరఖాస్తు ఫీజు :
ఓసీ మరియు బీసీ విద్యార్థులు 100 రూపాయలు మరియు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 50 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ విధానంలో SBI COLLECT లింక్ ద్వారా విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించవలెను.
NMMS స్కాలర్షిప్ పరీక్షలకు అప్లై చేసుకునే విద్యార్థులు ఈ క్రింది వెబ్సైటు ను సంప్రదించవచ్చును..
Website:
www.bse.ap.gov.in
అసలు NMMS పరీక్ష అంటే…??
ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అందరూ ఈ NMMS పరీక్షను వ్రాయడానికి దరఖాస్తు చేసుకోవచ్చు..
ఈ స్కాలర్షిప్ పరీక్షను బాగా వ్రాసి మంచి ఉత్తిర్ణత సాధించిన విద్యార్థులకు 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పూర్తి అయ్యే వరకూ ఒక ఏడాదికి నెలకు 1,000 రూపాయలు చొప్పున.. మొత్తం 12,000 రూపాయలు అనగా నాలుగు సంవత్సరాలకు 48,000 రూపాయలు స్కాలర్షిప్ గా భారత కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల బ్యాంకు అకౌంట్స్ లో పొందుపరుస్తుంది.
NMMS పరీక్షకు ఉండవల్సిన విద్యా అర్హతలు:
7వ తరగతిలో 55 శాతం మార్కులు (SC/ST -50 శాతం) మార్కులు సాధించిన విద్యార్థులు ఈ NMMS స్కాలర్షిప్ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఉండవల్సిన విద్యా అర్హతలుగా తెలుపబడినది.
ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలెను.
NMMS స్కాలర్షిప్ పరీక్ష విధానం:
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కు దరఖాస్తు చేసి పరీక్షలకు హాజరు అయ్యే విద్యార్థులకు ఈ క్రింద తెలిపినట్లుగా పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది..
ఈ పరీక్షలో విద్యార్థులకు రెండు పేపర్లను నిర్వహించడం జరుగుతుంది..
1). MAT (Mental Ability Test) :
రీజనింగ్ మరియు క్రిటికల్ థింకింగ్ టెస్ట్ ను 90 ప్రశ్నలకు నిర్వహించడం జరుగుతుంది.. ఈ పరీక్ష నిర్వహణ సమయం 90 నిముషాలుగా నిర్ణయించడం జరిగింది.
2). SAT (Scholarship Aptitude Test) :
మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్స్ టాపిక్స్ నుండి 90 ప్రశ్నలను అడుగుతారు.. ఈ పరీక్ష నిర్వహణ సమయం కూడా 90 నిముషాలుగా నిర్ణయించడం జరిగింది..
NMMS స్కాలర్షిప్ పరీక్ష ఎంపిక :
ఈ NMMS పరీక్షలను వ్రాసిన జనరల్ గ్రూప్ విద్యార్థులకు 40 % మార్కులు మరియు SC, ST విద్యార్థులకు 32 % మార్కులను ప్రతీ పరీక్ష పేపర్ లోనూ సాధించిన వారికి మాత్రమే స్కాలర్షిప్ లభించనున్నట్లు తెలుస్తుంది.
NOTE :
పై NMMS స్కాలర్షిప్ పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీ పరిధిలో ఉన్న విద్యార్థులకు అందించగలరు..
ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మరియు ఉద్యోగ సమాచారమును మన www.vidyavaradhi.com వెబ్సైటు ద్వారా చూడగలరు..
మీకు ఈ వివరాలు ఉపయోగకరంగా ఉన్నట్లుగా అనిపిస్తే ఈ క్రింది వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు..
వాట్సాప్ ఛానెల్ లింక్ :
https://whatsapp.com/channel/0029VbAqlrdBfxo7GfkcVP30
టెలిగ్రామ్ ఛానెల్ లింక్ :
సదా మీ విద్యా సేవలో..
మీ Sai’s విద్యా వారధి
{సాధనాత్ సాధ్యతే సర్వమ్}
. 🖊📖🖊

