Sai’s విద్యా వారధి కు స్వాగతం.. శుభ స్వాగతం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఆరు నెలల్లో ఏపీ దేవాదాయ శాఖ (ఎండోమెంట్ డిపార్టుమెంటు) లో పలు విభాగాలలో ఖాళీగా ఉన్న సుమారుగా 500 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది..
ఏపీ ప్రభుత్వం విడుదల చేయబోయే ఈ నోటిఫికేషన్ లో ఎండోమెంట్ డిపార్టుమెంటుకు అనగా దేవాదాయ శాఖకు చెందిన గ్రేడ్-1, గ్రేడ్-3 ఆఫీసర్స్, జూనియర్ అసిస్టెంట్ మరియు పురోహితులు, స్వీపర్స్, అటెండెర్స్ ఉద్యోగాలు ఉండనున్నాయి..
ఈ నోటిఫికేషన్ లో భాగంగా భర్తీ చేయబోయే ఎండోమెంట్ డిపార్టుమెంటు గ్రేడ్ -3 ఉద్యోగాలకు జనరల్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులందరు దరఖాస్తు చేసుకోవచ్చు..
ఈ ఉద్యోగాల భర్తీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు స్క్రీనింగ్ పరీక్ష (ప్రిలిమ్స్) మరియు మెయిన్స్ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది..
సిలబస్ ఈ క్రింది విధంగా ఉండే అవకాశం కలదు.
జనరల్ స్టడీస్ ను పేపర్-1 గా మరియు హిందూ ధర్మ తత్త్వం మరియు దేవాలయ వ్యవస్థ ను పేపర్-2 గా పరీక్షలను ఏపీపీఎస్సీ వారు నిర్వహించనున్నారు..
నోటిఫికేషన్ వచ్చే నాటికి మనం ముందుగానే ప్రణాళిక బద్దంగా సిలబస్ ను సిలబస్ లోని అంశాలను ముందుగానే ప్రిపేర్ అయితే మనకు దేవాదాయ శాఖలో గ్రేడ్-3 ఆఫీసర్స్ తదితర ఉద్యోగాలను సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి..
పేపర్ -2 సిలబస్ లో రామాయణం, మహాభారతం, భాగవతం, హిందూ పురాణాలు, హిందూ ఆగములు, హిందువుల పండుగలు, దేవాలయాలు- ఆదాయ వనరులు, కార్యనిర్వహణ అధికారి విధులు తదితర అంశాలు ఉండనున్నాయి..
ఈ పేపర్-2 పై పట్టు సాధిస్తే ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 ఆఫీసర్ ఉద్యోగం సాధించడం కొద్దిగా సులభతరం కావచ్చు అని మన Sai’s విద్యా వారధి తరపున అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాము..
ఇందులో భాగంగానే ఈ రోజు పేపర్-2 కు సంబంధించిన హిందూ ధర్మ తత్త్వం దేవాలయ వ్యవస్థ సిలబస్ లో పొందుపరిచిన ముఖ్యమైన అంశాలకు సంబంధించిన ముఖ్యమైన మోడల్ బిట్స్ ను మీకు అందించడం జరుగుతుంది..
ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్-3 ఎగ్జామ్ పేపర్-2 టాప్-10 ఇంపార్టెంట్ బిట్స్ :
1). శ్రీ సీతారాముల పుణ్య చరిత్రను వాల్మీకీ మహర్షి ఎన్ని వేల శ్లోకములతో కావ్యముగా తీర్చిదిద్దారు..?
A). 23,000 శ్లోకాలు
B). 24,000 శ్లోకాలు
C). 25,000 శ్లోకాలు
D). 26,000 శ్లోకాలు
జవాబు: B – 24,000 శ్లోకాలు.
2). రామాయణ కావ్యంలోని భాగములను ఏమని పిలుస్తారు..?
A). కాండములు
B). సర్గలు
C). స్కందములు
D). పర్వములు
జవాబు : A – కాండములు.
3). ఈ క్రింది వారిలో ఎవరిని “సౌమిత్రి” అని పిలువబడేవారు..?
A). శ్రీ రాముడు
B). లక్ష్మణుడు
C). భరతుడు
D). శత్రుఘ్నుడు
జవాబు: B- లక్ష్మణుడు.
4). శుర్పణఖ అనే పేరుకు గల అర్ధం..?
A). ముక్కు లేనిది.
B). చెవులు లేనిది
C). ముక్కు, చెవులు లేనిది
D). వాడియైన గోళ్లు కలది.
జవాబు: D – వాడియైన గోళ్లు కలది.
5). ఈ క్రింది వారిలో వానరులకు రాజు ఎవరు..?
A). వాలి
B). హనుమంతుడు
C). సుగ్రీవుడు
D). జాంబవంతుడు
జవాబు: C – సుగ్రీవుడు.
6). ఈ క్రింద పేర్కొనబడిన వారిలో “రంగనాథ రామాయణం” ను రచించిన వారు ఎవరు..?
A). గోన బుద్ధారెడ్డి
B). కంకంటి పాపరాజు
C).వావిలికొలను సుబ్బారావు
D). శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి
జవాబు: A – గోన బుద్ధారెడ్డి.
7). మహాభారతంలో ఎన్ని పర్వాలు ఉంటాయి..?
A). 11 పర్వాలు
B). 12 పర్వాలు
C). 14 పర్వాలు
D). 18 పర్వాలు
జవాబు: D – 18 పర్వాలు.
8). ఈ క్రింది నలుగురులో పరిక్షిత్తు కుమారుడుగా పిలువబడేవారు ఎవరు..?
A). ప్రదీపుడు
B). భీమసేనుడు
C). శంతనుడు
D). పరాశనుడు
జవాబు: B – భీమసేనుడు.
9). బలరాముడి కుమార్తె అయిన ఈ క్రింది వారిలో ఎవరిని అర్జునుడి కుమారుడైన అభిమన్యుడు కు ఇచ్చి వివాహం జరిపించారు..?
A). ప్రమీల
B). జాంబవతి
C). ఉత్తర
D). శశిరేఖ
జవాబు: D – శశి రేఖ.
10). శ్రీ కృష్ణుని రాజధాని అయిన “ద్వారక” నగరం ఈ క్రింది ఏ భారతీయ రాష్ట్రంలో కలదు..?
A). ఉత్తరప్రదేశ్
B). ఒరిస్సా
C). గుజరాత్
D). మధ్యప్రదేశ్
జవాబు: C – గుజరాత్.
ముఖ్యమైన గమనిక :
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మదాయ శాఖలో త్వరలో భర్తీ చేయనున్న ఈ 500 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మరిన్ని ముఖ్యమైన విషయాలు మరియు డైలీ ప్రాక్టీస్ బిట్స్ ను మీరు అందుకోవాలనుకుంటే 7013252312 వాట్సాప్ నెంబర్ నెంబర్ కు Hai అని మెసెజ్ పంపగలరు.. మరియు
ఈ క్రింది వాట్సాప్ ఛానెల్ ను ఫాలో అవ్వగలరు..
వాట్సాప్ ఛానెల్ లింక్ :
https://whatsapp.com/channel/0029VbAqlrdBfxo7GfkcVP30
ఇట్లు :
మీ Sai’s విద్యా వారధి
{సాధనాత్ సాధ్యతే సర్వమ్}
. 🖊📖🖊

