Sai’s విద్యా వారధికు స్వాగతం.. శుభ స్వాగతం..
Sai’s విద్యా వారధి డైలీ కరెంట్ అఫైర్స్-2025 ఇంపార్టెంట్ టాప్ -10 బిట్స్ ను మీకు అందించడం జరుగుతుంది..
మీకు అందించే ఈ ముఖ్యమైన బిట్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో, ఇతర కేంద్ర ప్రభుత్వ రాబోయే ప్రభుత్వ ఉద్యోగ నియమకాలలో భాగంగా నిర్వహించే స్క్రీనింగ్ మరియు మెయిన్స్ పరీక్షలలో ఖచ్చితంగా రావడానికి అవకాశాలు పుష్కళంగా ఉన్నాయి..
కావున మన వెబ్సైటులో అందించే ఈ బిట్స్ ను మీరు ఒక నోట్స్ ను పెట్టుకుని అందులో నోట్ చేసుకుంటే మీ మీ పరీక్షల ప్రిపరేషన్ లో అత్యంత ఉపయుక్తంగా ఉంటాయి..

డైలీ కరెంట్ అఫైర్స్- 2025 ఇంపార్టెంట్ టాప్ 10 బిట్స్:
1). “సెమికాన్ ఇండియా-2025” సదస్సు ఈ క్రింది ఏ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది..??
A). మహారాష్ట్రలోని ముంబై
B). ఢిల్లీ లోని యశోభూమి
C). కర్ణాటకలోని బెంగళూరు
D). మధ్యప్రదేశ్ లోని ఇండోర్
జవాబు: B). ఢిల్లీలోని యశోభూమి.
వివరణ ;
సెమికాన్ ఇండియా-2025 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీకి అందజేసిన భారత తొలి స్వదేశీ 32-బిట్ చిప్..అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సెమీ కండక్టర్ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు భారత్ సాగిస్తున్న ప్రయాణంలో ఒక మైలు రాయిగా దీనిని అభివర్ణిస్తున్నారు..
ఈ స్వదేశీ 32- బిట్ చిప్ ను చండిఘడ్ లోని భారత అంతరీక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన సెమీ కండక్టర్ లేబర్యాటరీ రూపొందించినది..ఈ 32-బిట్ మైక్రో ప్రాసెసర్ కు “విక్రమ్-3201” అనే పేరు పెట్టారు.
అంతరిక్షంలో ప్రయోగించే రాకెట్స్ లో ఏర్పడే కఠోర పరిస్థితులను తట్టుకుని నిలబడేలా దీనిని రూపొందించడం జరిగింది..
2009 వ సంవత్సరంలో వచ్చిన 16-బిట్ చిప్ విక్రమ్-1601 కు ఇది అప్ గ్రేడ్ వెర్షన్..
విక్రమ్-3201 ను పీ ఎస్ ఎల్ వి – సీ 60 రాకెట్ లో విజయవంతంగా పరీక్షించడం జరిగింది..
అదనపు వివరణ:
ఇస్రో (ISRO) :
భారత అంతరీక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) ఏర్పడిన సంవత్సరం 1969.
ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది
ఇస్రో పితామహుడు అని విక్రమ్ సారాభాయ్ ను పిలుస్తారు
ప్రస్తుత ఇస్రో చైర్మన్: వి. నారాయణన్.
2). ఈ క్రింది వారిలో “ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్స్” (డిఫరెంట్ స్ట్రోక్స్ 1998-2024) పుస్తకాన్ని వ్రాసిన వారు ఎవరు..?
A). ఏ కే భట్టాచార్య
B). కరుణేశ్ బజాజ్
C). ఆర్. ఎన్. రవి
D). గీతా జీవన్
జవాబు: A). ఏ. కే. భట్టాచార్య
వివరణ:
ఏ కే భట్టాచార్య వ్రాసిన పుస్తకాల సిరీస్ లలో “ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్స్” అనేది మూడవ పుస్తకం.
ఈయన “దీ స్టీవార్ట్స్ ఆఫ్ డెస్టినీ”(1947-1977), ది రీ ఫార్మర్స్ (1977-1998) లు బట్టాచార్య వ్రాసిన సిరీస్ లోని తొలి రెండు పుస్తకాలు.
3). క్యూ ఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2025 లో ప్రపంచంలోనే అగ్రగామి విద్యా సంస్థగా ఏది నిలిచింది..?
A). మసాచు సెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)
B). ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఢిల్లీ)
C). ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాన్పుర్)
D). ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (తిరుపతి)
జవాబు: A- మసాచు సెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ).
వివరణ:
వరుసగా 14వ సంవత్సరం కూడా క్యూ ఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో అగ్రగామి విద్యా సంస్థగా మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నిలిచింది.
మన ఇండియా నుండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ భారత్ లో మొదటి స్థానములో నిలువగా మొత్తం మీద 123 వ ర్యాంక్ లో నిలిచింది.
4). ఈ క్రింద పేర్కొనబడిన వాటిలో వస్తు-సేవల పన్ను (జీఎస్టీ) స్వరూపంలో తాజాగా తీసుకుని వచ్చిన మార్పులలో భాగంగా కనుమరుగయ్యే రెండు స్లాబులును పేర్కొనండి..??
A). 12%, 28%
B). 5%, 18%
C).10%, 12%
D). 12%, 24%
జవాబు: A- 12%, 28%
వివరణ:
జీఎస్టీ స్వరూపంలో కీలక మార్పులు తాజాగా భారత కేంద్రప్రభుత్వం తీసుకుని వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న నాలుగు స్లాబుల బదులు ఇకపై రెండే కొనసాగనున్నాయి..
వీటిలో ఒకటి 5% కాగా రెండవది 18%.
జీఎస్టీ పాలకమండలి 56వ సమావేశం లో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రస్తుత భారత దేశ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
ఈ తాజా నిర్ణయం ప్రకారం 12%, 28% పన్ను స్లాబులు ఇకపై ఉండవు.
5). భారత నౌక దళంలోనికి “ఐఎన్ఎస్ తమల్” జూలై 1,2025 నాడు భారత నౌక దళంలోనికి చేరింది.. అయితే ఈ అత్యాధునిక నౌకను ఈ క్రింది ఏ రెండు దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి..?
A). భారత్- చైనా
B). భారత్- బ్రిటన్
C). భారత్- శ్రీలంక
D).భారత్-రష్యా
జవాబు: D- భారత్- రష్యా.
వివరణ:
ఐఎన్ఎస్ తమల్ 125 మీటర్ల పొడవు, 3,900 టన్నుల బరువు ఉంటుంది.
భూమి పైన, సముద్రంలోని లక్ష్యాలను చేధించగల దీర్ఘశ్రేణి బ్రహ్మోస్ క్రూయిజ్ మిస్సయిల్ వంటి 26 శాతం స్వదేశీ ఆయుధ వ్యవస్థలు ఇందులో ఉన్నాయి.
6). ఈ క్రింది ఏ తేదీనాడు ప్రతీ ఏడాది ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు భారత కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది..?
A). ఆగష్టు 21
B). ఆగష్టు 23
C). సెప్టెంబర్ 21
D). సెప్టెంబర్ 23
జవాబు: D- సెప్టెంబర్ 23.
వివరణ:
సెప్టెంబర్ 23 వ తేదీన పగలు మరియు రాత్రి ఒకే నిడివి తో ఉంటాయి.
7). భారతదేశములోనే తొలిసారిగా ఈ క్రింది ఏ రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలు అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ ను తీసుకుని వచ్చింది..?
A). అరుణాచల్ ప్రదేశ్
B). ఆంధ్రప్రదేశ్
C). మధ్యప్రదేశ్
D). ఉత్తరప్రదేశ్
జవాబు: B- ఆంధ్రప్రదేశ్.
వివరణ:
దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవలు అందించేందుకు, ప్రజల నుండి వినతుల స్వీకరణకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసెందుకు వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది.
మొదటి దశలో 153 రకాల సేవలను అందించనున్నారు.
వాట్సాప్ నెంబర్: 9552300009.
8). ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) 2025 సంవత్సరానికి గానూ వెలువరించిన లింగ సమానత్వ సూచిలో భారత్ ఎన్నవ ర్యాంక్ లో నిలిచింది..??
A). 129
B). 130
C). 131
D). 111
జవాబు: C- 131.
వివరణ :
ఈ జాబితాలో వరుసగా 16వ సారి ఐస్ ల్యాండ్ మొదటి స్థానములో నిలువగా, ఫిన్లాండ్ రెండవ స్థానములో, నార్వే మూడవ స్థానములో నిలిచింది.
గడిచిన ఏడాది భారత్ 129 వ ర్యాంక్ లో నిలిచింది.
9). “ధర్మ గార్డియన్” అనే ఆర్మీ విభాగానికి చెందిన వ్యాయామం (సైనిక విన్యాసం) ఈ క్రింది ఏ రెండు దేశాలకు చెందినది..?
A). భారత్-బంగ్లాదేశ్
B). భారత్-జపాన్
C). భారత్-మాల్దివ్స్
D). భారత్-నేపాల్
జవాబు: B- భారత్-జపాన్.
వివరణ:
ధర్మ గార్డియన్ అనే ఆర్మీకి చెందిన సైనిక విన్యాసములో భారత్-జపాన్ దేశాలు కలసి పాల్గొన్నాయి.
భారత్-జపాన్ దేశాలకు చెందిన నేవీ విభాగానికి చెందిన సైనిక విన్యాసం పేరు : “ JIMEX”
10). “నేను-నా అమరావతి” అనే పుస్తకాన్ని వ్రాసిన రచయిత ఈ క్రింది వారిలో ఎవరు..?
A). బాల కోటయ్య
B). దగ్గుబాటి వెంకటేశ్వర రావు
C). బండారు దత్తాత్రేయ
D). కిల్లాడ సత్యనారాయణ
జవాబు: A- బాల కోటయ్య.
వివరణ:
దగ్గుబాటి వెంకటేశ్వరరావు-ప్రపంచ చరిత్ర
బండారు దత్తాత్రేయ-ప్రజల కథే నా ఆత్మ కథ
కిల్లాడ సత్యనారాయణ-బహుముఖ బనారస్
ముఖ్య గమనిక:
పైన మీకు అందించిన కరెంట్ అఫైర్స్ టాప్- 10 బిట్స్ ను ఒకసారి మనస్ఫూర్తిగా చదవండి.. మీ పరీక్షల ప్రిపరేషన్ లో పై బిట్స్ ఉపయోగకరంగా ఉన్నాయని మీ మనస్సుకు అనిపిస్తే మీ సమీపంలో ఉన్న రాబోయే రోజుల్లో కాబోయే ప్రభుత్వ ఉద్యోగార్థులకు అందరికీ షేర్ చేయగలరు.. మరియు ఇలాంటి ముఖ్యమైన డైలీ కరెంట్ అఫైర్స్ బిట్స్ ను మీరు ప్రతీ రోజు అందుకోవాలి అని అంటే ఈ క్రింది వాట్సాప్ నెంబర్ 7013252312 కు మీ పేరు మరియు మీరు ప్రిపేర్ అవుతున్న పోటీ పరీక్ష వివరాలను తెలియజేయగలరు..
పోటీ పరీక్షలో ప్రతీ ఒక్క మార్కు విలువైనదే.. అలాంటి ముఖ్యమైన ప్రతీ ఒక్క మార్కును మీకు అందించాలనే మంచి ఉద్దేశ్యంతో మేము చేస్తున్న ఈ పనికి మీ సహకారం అందిస్తారని ఆశిస్తూ..
మీ Sai’s విద్యా వారధి
{సాధనాత్ సాధ్యతే సర్వమ్}
. 🖊📖🖊


Good 👍
👌🇮🇳🇮🇳🇮🇳💞👍