Sai’s విద్యా వారధికు స్వాగతం.. శుభ స్వాగతం..
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములలో రైల్వే గ్రూప్ డీ మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మారుతున్న పరీక్షల ప్రశ్నావళిను పరిగణనలోనికి తీసుకుని మీ పరీక్షల ప్రిపరేషన్ లో ఉపయోగపడే విధముగా ఈ టాప్ 10 బిట్స్ ను మీకు అందించడం జరుగుతుంది ..ఈ బిట్స్ ను మీరు చదివిన తర్వాత మీకు ఉపయోగపడుతున్నాయని అనిపిస్తే మీ పరిధిలో ఉన్న కాబోయే ఉద్యోగార్ధులకు అందరికీ ఈ పోస్ట్ ని షేర్ చేయగలరు ..
జనరల్ స్టడీస్ & కరెంట్ అఫైర్స్ – 2025 టాప్- 10 ఇంపార్టెంట్ బిట్స్ :
1). ‘అండము, హార్మిక మరియు ఛత్రము’ అనేవి ఈ క్రింది బౌద్ధ స్మారక కట్టడాలలో దేనిలో అంతర్భాగం..?
A). చైత్యాలు
B). విహారాలు
C). స్తూపములు
D). బసదీలు
జవాబు: C – స్తూపములు.
2).ఈ క్రింది ఏ మౌర్య అధికారి తూనికలు మరియు కొలతలకు బాధ్యతలు వహించారు..?
A). శుల్కాధ్యక్ష
B). సమస్తాధ్యక్ష
C). పౌతవాధ్యక్ష
D). పాణ్యాధ్యక్ష
జవాబు: C – పౌతవాధ్యక్ష.
3). వరాహమిహిర రచించిన రొమక సిద్దాంతం ఈ క్రింది వానిలో దేనికి సంబందించినది..?
A). రసాయన శాస్త్రం
B). గణితం
C). ఖగోళ శాస్త్రం
D). ఔషధం
జవాబు: C – ఖగోళ శాస్త్రం.
4). కేరళలో ప్రారంభమైన వైకోమ్ సత్యాగ్రహం దేనికి సంబంధించినది..?
A). బాల కార్మికుల నిర్మూలన
B). ఆలయ ప్రవేశ ఉద్యమం
C). మహిళా విముక్తి
D). వైష్ణవ ఉద్యమం
జవాబు: B – ఆలయ ప్రవేశ ఉద్యమం.
5). క్రింది వాటిలో హరప్పా ప్రదేశం కానిది ఏది..?
A). సుట్కాగెన్ దోర్
B). సూర్కోటడ
C). సోహాగౌరా
D). రాఖీ గర్హి
జవాబు: C – సోహాగౌరా.
6). ఉల్కలు అంతరీక్షం నుండి ప్రవేశించినప్పుడు, ఈ క్రింద ఇవ్వబడిన ఏ వాతావరణ పొరలలో కాలిపోవడం జరుగుతుంది..?
A). మెసో ఆవరణం
B). థర్మో ఆవరణం
C). అయనో ఆవరణం
D). ఎక్సో ఆవరణం
జవాబు: A – మెసో ఆవరణం.
7). ఈ క్రింది ఏ రైల్వే జోన్ కు బిలాస్ పూర్ ప్రధాన కార్యాలయం..?
A). ఆగ్నేయ
B). తూర్పు తీర
C). తూర్పు మధ్య
D). ఆగ్నేయ మధ్య
జవాబు: D – ఆగ్నేయ మధ్య.
8). సెప్టెంబర్ 12,2025 నాడు ఈ క్రింది ఏ దేశానికీ సంపూర్ణ దేశ ప్రతిపత్తి కల్పించాలంటూ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య చేసిన తీర్మానానికి భారత్ తన మద్దతును తెలిపింది..?
A). ఇజ్రాయెల్
B). పాలస్తీనా
C). కెన్యా
D). నమిబియా
జవాబు: B – పాలస్తీనా.
జవాబు – వివరణ:
పాలస్తీనాకు సంపూర్ణ దేశ ప్రతిపత్తి కల్పించాలంటూ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సభ చేసిన తీర్మానానికి భారత్ తో సహా 142 దేశములు అనుకూలంగా ఓటు వేయడం జరిగింది.. 10 దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి.
దీనితో పాటు ఇజ్రాయెల్, పాలస్తీనాలు తమ మధ్యన ఉన్న వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరణ చేసుకోవాలన్న న్యూయార్క్ డిక్లరేషన్ ను తీర్మానం సమర్దించినది.
9). సెప్టెంబర్ 13,2025 నాడు “బైరాబి సైరాంగ్ రైల్వే లైన్” ను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ క్రింది ఏ ప్రాంతంలో ప్రారంభం చేయడం జరిగింది..?
A). మణిపూర్
B). మిజోరం
C). అస్సాం
D). గుహవటి
జవాబు: B – మిజోరం.
జవాబు-వివరణ:
8,070 కోట్ల రూపాయలతో నిర్మితమైన బైరాబి సైరాంగ్ రైల్వే లైన్ ను మిజోరం లో సెప్టెంబర్ 13,2025 నాడు భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభం చేయడం జరిగింది..
51 కిలోమీటర్లు పొడవైన ఈ కారిడార్ మిజోరం ను దేశంలోని ఇతర ప్రాంతములతో అనుసంధానం చేస్తుంది.. 153 వంతెనలు, 45 సొరంగాలు ఈ లైన్ లో ఉన్నాయి.
10). భారతదేశంలో తొలిసారిగా చట్టసభల మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సు సెప్టెంబర్ 14,2025 నాడు ఈ క్రింది నగరంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించడం జరిగింది..?
A). బెంగళూరు
B). ముంబై
C). హైదరాబాద్
D). తిరుపతి
జవాబు: D – తిరుపతి.
జవాబు-వివరణ:
భారత్ లోనే తొలిసారిగా చట్ట సభల మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సును 2025,సెప్టెంబర్ 14నాడు ప్రస్తుత లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తిరుపతిలో ప్రారంభం చేయడం జరిగింది..
తిరుపతి జిల్లా తిరుచానూరు సమీపంలోని రాహుల్ కన్వెన్షన్ సెంటర్ లో రెండు రోజుల పాటు జరుగుతుంది.
గమనిక :
పోటీపరీక్షలలో రావడానికి అవకాశాలు ఉండే మరియు అటు కేంద్ర ప్రభుత్వ ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకములలో నిర్వహించే పరీక్షలలో మీ ప్రిపరేషన్ కు ఉపయోగపడే ఇలాంటి అత్యంత ముఖ్యమైన బిట్స్ ను మీరు ప్రతి రోజు పిడిఎఫ్ ల రూపంలో మీ వాట్సాప్ ద్వారా అందుకోవాలనుకుంటే వెంటనే 7013252312 వాట్సాప్ నెంబర్ కు Hai అని మెసెజ్ పంపితే పూర్తి వివరాలను మీకు తెలియజేయడం జరుగుతుంది..
మరిన్ని విద్యా మరియు ఉద్యోగ సమాచారాలను ఎప్పటికప్పుడు ఉచితంగా అందుకోవాలి అనుకుంటే ఈ క్రింది వాట్సాప్ ఛానెల్ ను ఫాలో చేయగలరు..
https://whatsapp.com/channel/0029VbAqlrdBfxo7GfkcVP30
ఇట్లు,
మీ Sai’s విద్యా వారధి
{సాధనాత్ సాధ్యతే సర్వమ్}
🖊📖🖊


బాగుంది.