Sai’s విద్యా వారధికు స్వాగతం.. శుభ స్వాగతం..
డైలీ కరెంట్ అఫైర్స్ టాప్- 10 మోడల్ బిట్స్ ను ఈ రోజు మనం తెలుసుకుందాం..
డైలీ మేము మీకు అందించే ఈ కరెంట్ అఫైర్స్ టాప్-10 బిట్స్ లో అంతర్జాతీయ, జాతీయ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు, క్రీడలు ఇతర ముఖ్యమైన అంశాలను గురించి ప్రశ్నలు మరియు వివరణతో కూడిన జవాబులు మీకు అందించడం జరుగుతుంది..
బారతీయ రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలను నవంబర్ 17,2025 నుండి డిసెంబర్ 2025 వరకూ నిర్వహించనున్నట్లుగా రైల్వే బోర్డు తాజాగా ప్రకటన చేసిన నేపద్యంలో అటు కేంద్ర ప్రభుత్వ మరియు ఇటు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ క్రింది బిట్స్ ను రూపొందించడం జరిగినది .. కావున మీ పరిధిలో ఉన్న సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క మిత్రునికి మన వెబ్సైట్ లో పొందుపరిచే ఈ మోస్ట్ ఇంపార్టంట్ బిట్స్ ను షేర్ చేయగలరని ఆశిస్తున్నాము ..
డైలీ కరెంట్ అఫైర్స్ టాప్-10 బిట్స్ :
1). ఈ క్రింది వారిలో సెప్టెంబర్ 5,2025 నాడు థాయ్ లాండ్ దేశానికీ నూతన ప్రధానిగా ఎన్నిక అయింది ఎవరు..?
A). పేతొంగ్ తార్న్ షినవ్రత
B). అనుతిన్ చర్న్ విరకుల్
C). ఆంటోనియో లూయిస్
D). సీడీ ఔల్ తాహ్
జవాబు: B- అనుతిన్ చర్న్ విరకుల్.
వివరణ:
థాయ్ లాండ్ పార్లమెంట్ 2025,సెప్టెంబర్ 5వ తేదీన అనుతిన్ చర్న్ విరకుల్ ను థాయిలాండ్ దేశానికీ నూతన ప్రధానిగా ఎన్నుకుంది.
గడిచిన రెండు సంవత్సరాలలో థాయిలాండ్ ప్రధానిగా ఎన్నికైన మూడవ వ్యక్తి విరకుల్ కావడం విశేషం.
థాయిలాండ్ గత ప్రధాని పేతొంగ్ తార్న్ షినవ్రతాను ప్రధాని పదవీ నుండి రాజ్యంగ న్యాయస్థానం తొలగించిన నేపథ్యంలో నూతన ప్రధాని ఎన్నిక థాయిలాండ్ లో జరిగింది..
థాయిలాండ్ – ఇతర వివరణలు :
థాయిలాండ్ ఆసియా ఖండంలో కలదు.
రాజధాని : బ్యాంకాక్
కరెన్సీ : బాత్
మెనమ్ (చావోప్రయ) నది ఒడ్డున బ్యాంకాక్ (థాయిలాండ్) కలదు.
థాయిలాండ్ పురాతన పేరు – సయాం.
“ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ “ అని థాయిలాండ్ కు పేరు.
2). ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్-2025 ప్రకటించిన ర్యాంకులలో అత్యుత్తమ పనితీరుతో అగ్రస్థానంలో ఈ క్రింది ఏ ఐఐటీ నిలిచింది..?
A). ఐఐటీ మద్రాస్
B). ఐఐటీ బెంగళూరు
C). ఐఐటీ బాంబే
D). ఐఐటీ ఢిల్లీ
జవాబు: ఐఐటీ మద్రాస్.
వివరణ :
భారతదేశ కేంద్ర విద్యా శాఖ సెప్టెంబర్ 4,2025 నాడు నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్-2025 ర్యాంకులను విడుదల చేయగా.. అత్యుత్తమ పని తీరుతో ఐఐటీ మద్రాస్ అగ్రస్థానంలో నిలిచింది.
3). క్రీడల్లో ప్రపంచంతో పోటీ పడేలా స్పోర్ట్స్ పాలసీ (నూతన క్రీడా విధానం) ను తాజాగా ఈ క్రింది ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చినది..?
A). ఆంధ్రప్రదేశ్
B). తెలంగాణ
C). ఝార్ఖండ్
D). ఉత్తరాఖండ్
జవాబు: B- తెలంగాణ.
వివరణ:
క్రీడలలో ప్రపంచంతో పోటీపడేలా స్పోర్ట్స్ పాలసీను రూపొందించామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి తెలిపారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీలతో తెలంగాణ రాష్ట్ర క్రీడా రంగాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హైదరాబాద్ నగరంలో హెచ్ ఐ సీ సీ లో నిర్వహించిన తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లీవ్ లో తెలంగాణ రాష్ట్ర నూతన క్రీడా విధానాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరణ చేశారు.
4). ఈ క్రింది ఏ రాష్ట్రంలోని పేదలకు 25లక్షల రూపాయల వరకూ ఉచిత వైద్య సేవలు అందించే నూతన ఆరోగ్య విధానం రూపకల్పనకు నిర్ణయం తీసుకుంది..?
A). ఉత్తరప్రదేశ్
B).మధ్యప్రదేశ్
C). ఆంధ్రప్రదేశ్
D). కేరళ
జవాబు: C – ఆంధ్రప్రదేశ్.
వివరణ:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేదలకు 25 లక్షల రూపాయలు వరకూ ఉచిత వైద్య సేవలు అందించే సరిక్రొత్త ఆరోగ్య విధానం రూపకల్పనకు ఏపీ రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది.
దీనికి సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ ప్రతీపాదనకు రాష్ట్ర మంత్రి మండలి సెప్టెంబర్ 4,2025 నాడు ఆమోదం తెలిపింది.
ప్రధాని జన ఆరోగ్య యోజన- ఎన్టీఆర్ వైద్య సేవ క్రింద హైబ్రిడ్ విధానంలో నూతన ఆరోగ్య విధానం రూపొందించనున్నారు.
5). “సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్-2025”(సైమా 2025) లో ఉత్తమ చిత్రం గా ఈ క్రింది ఏ సినిమా అవార్డును కైవసం చేసుకుంది..?
A). పుష్ప-2
B). హనుమాన్
C). కల్కి 2898 AD
D). లక్కీ భాస్కర్
జవాబు: C- కల్కి 2898 AD.
వివరణ:
13వ సైమా అవార్డ్స్ వేడుకలు దుబాయ్ వేదికగా నిర్వహించడం జరిగింది. ఉత్తమ చిత్రంగా కల్కి 2898 ఏ డి అవార్డు ను కైవసం చేసుకుంది.
6). ఈ క్రింది ప్రముఖులలో మాజీ భారత ప్రధాని పీవీ నరసింహ రావు మెమోరియల్ ఫౌండేషన్ ఎకనామిక్స్ అవార్డ్ ను అందుకున్నవారు ఎవరు..?
A). మన్మోహన్ సింగ్
B). జయప్రకాశ్ నారాయణ
C). అనిల్ కుమార్
D). రామచంద్రమూర్తి
జవాబు: A – మన్మోహన్ సింగ్.
వివరణ:
భారతదేశ మాజీ ప్రధాన మంత్రివర్యులు పీవీ నరసింహరావు మెమోరియల్ ఫౌండేషన్ ఎకనామిక్స్ అవార్డును మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు ప్రకటించడం జరిగింది.
7). ఆసియా హాకీ కప్-2025 విజేతగా నిలిచిన దేశం ఏది..?
A). భారత్
B). దక్షిణ కోరియా
C). థాయిలాండ్
D). చైనా
జవాబు: A- భారత్.
వివరణ:
సెప్టెంబర్ 7,2025 నాడు రాజ్ గిర్ (బీహార్) లో జరిగిన ఆసియా కప్ హాకీ పోటీల ఫైనల్స్ లో 4-1 తేడాతో దక్షిణకోరియా పై గెలిచి భారత హాకీ జట్టు ఆసియా కప్ హాకీ-2025 విజేతగా నిలిచింది.
తాజాగా గెలిచిన ఈ టైటిల్ తో హార్మన్ ప్రీత్ సేన 2026 హాకీ వరల్డ్ కప్ నకు నేరుగా అర్హతను సాధించింది.
8). 2026 ఆగష్టు లో జరిగే ప్రతిష్టాత్మక ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ కు ఈ క్రింది ఏ భారతీయ నగరం ఆతిద్యం ఇవ్వనుంది..?
A). విశాఖపట్నం
B). హైదరాబాద్
C). చెన్నై
D). ఢిల్లీ
జవాబు: D – ఢిల్లీ.
వివరణ:
2025 పారిస్ నగరంలో జరిగిన ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ఆగష్టు 31న ముగియగా..2026, ఆగష్టు లో వరల్డ్ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ కు భారతదేశ రాజధాని నగరం ఢిల్లీలో జరుగనున్నట్లు BWF ఒక ప్రకటన ద్వారా తెలిపింది.
9). భారత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 23వ లా కమిషన్ ఛైర్మన్ గా ఈ క్రింది వారిలో ఎవరు నియమితులైనారు..?
A). దినేష్ మహేశ్వరీ
B). డి. పీ. వర్మ
C). హితేష్ జైన్
D). రీటా వశిష్ట
జవాబు: A – దినేష్ మహేశ్వరీ.
వివరణ:
భారత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 23 వ లా కమిషన్ చైర్మన్ గా సుప్రీమ్ కోర్ట్ రిటైర్డ్ జడ్జి దినేష్ మహేశ్వరీ 2025 ఏప్రిల్ 15వ తేదీన బాధ్యతలు స్వీకరించారు..
ఈ 23 వ లా కమిషన్ సెప్టెంబర్ 1,2024 నుండి ఆగష్టు 31,2027 వరకూ పని చేయనుంది.
10). ఖో- ఖో ప్రపంచ కప్ 2025 విజేతగా నిలిచిన జట్టు ఏది..?
A). భారత్
B). నేపాల్
C). జపాన్
D). కాంబోడియా
జవాబు: A – భారత్.
వివరణ:
మొట్ట మొదటి సారిగా జరిగిన ఖో-ఖో వరల్డ్ కప్ ఇండియా లోని న్యూ ఢిల్లీ లో నిర్వహించగా.. పురుషుల మరియు మహిళల విభాగములలో భారత జట్టు విజేతగా నిలిచింది.
మహిళల ఫైనల్స్ లో భారత్ 78-40 తో నేపాల్ పై, పురుషుల ఫైనల్స్ లో భారత్ 54-36తో నేపాల్ పై విజయం సాధించినది.
రెండవ ఖో-ఖో ప్రపంచ కప్ 2027 లో బర్మింగ్ హమ్ ఎడ్జ్ బాస్టన్ స్టేడియం (ఇంగ్లాండ్) లో నిర్వహించనున్నారు.
NOTE :
అటు కేంద్ర ప్రభుత్వ మరియు ఇటు ఇరు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు మేము అందిస్తున్న ఈ డైలీ కరెంట్ అఫైర్స్ బిట్స్.. ఉపయోగకరంగా అనిపిస్తున్నాయి అంటే క్రింది emoji సింబల్స్ ద్వారా మీ అభిప్రాయం తెలియజేయగలరు..
రాబోయే రైల్వే గ్రూప్ డీ పరీక్షలకు సంబందించి పైన తెలిపిన బిట్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి .. ఇలాంటి అతి ముఖ్యమైన డైలీ కరెంట్ అఫైర్స్ టాప్ 10 బిట్స్ మరియు జనరల్ అవేర్నెస్ టాప్ 10 బిట్స్ ను నేరుగా పిడిఎఫ్ రూపంలో అందుకోవాలి అని అనుకుంటే వెంటనే 7013252312 వాట్సప్ నెంబర్ కు hai అని మెసేజ్ పంపించగలరు .
ఎప్పటికప్పుడు విద్యా మరియు ఉద్యోగ సమాచారం అందుకోవడానికి ఈ క్రింది వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు..
https://whatsapp.com/channel/0029VbAqlrdBfxo7GfkcVP30
సదా మీ సేవలో..
మీ Sai’s విద్యా వారధి
{సాధనాత్ సాధ్యతే సర్వమ్}
. 🖊📖🖊

