Sai’s విద్యా వారధి కు స్వాగతం.. శుభ స్వాగతం..
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములలో రైల్వే గ్రూప్- డి మరియు ఇతర గ్రూప్-1, గ్రూప్-2, ఎండోమెంట్ డిపార్టుమెంటు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలను కైవసం చేసుకునే క్రమంలో అత్యంత కీలక పాత్ర వహించే జనరల్ స్టడీస్ మరియు కరెంట్ అఫైర్స్-2025 టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ 10 బిట్స్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం..
డైలీ కరెంట్ అఫైర్స్ టాప్- 10 బిట్స్ :
1).ఈ క్రింది వారిలో భారత 15వ ఉపరాష్ట్రపతిగా సెప్టెంబర్ 12,2025 నాడు ప్రమాణ స్వీకారం చేసిన వారు ఎవరు..?
A). హమీద్ అన్సారీ
B). జగదీప్ ధన్ ఖడ్
C). సీ పీ రాధా కృష్ణన్
D). జిష్ణు దేవ్ వర్మ
జవాబు: C – సీ పీ రాధా కృష్ణన్.
జవాబు – వివరణ:
భారత 15వ ఉపరాష్ట్రపతిగా చంద్రాపురం పొన్ను స్వామి రాధా కృష్ణన్ బాధ్యతలు చేపట్టడం జరిగింది.రాష్ట్రపతి భవన్ లోని గణతంత్ర మండపంలో ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాధా కృష్ణన్ చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది..
రాధా కృష్ణన్ పదవికాలం 2030 సెప్టెంబర్ 11 వరకూ ఉండనుంది.
కాగా ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీయే పార్టీ అభ్యర్థి సీపీ రాధా కృష్ణన్ తన సమీప ప్రత్యర్థి, విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బుచ్చి రెడ్డి సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం జరిగింది..
రాధా కృష్ణన్ 2023 ఫిబ్రవరి 12 న ఝార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ గా నియమితులు కావడం జరిగింది..కొన్ని సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా కూడా అదనపు బాధ్యతలు చేపట్టడం జరిగింది.. తదుపరి 2024 జూలై 27 నుండి మహారాష్ట్ర గవర్నర్ గా కూడా రాధా కృష్ణన్ బాధ్యతలను నిర్వహించడం జరిగింది..
శ్రీ సర్వేపల్లి రాధా కృష్ణన్, ఆర్. వెంకట రామన్ ల తర్వాత తమిళనాడు నుండి ఉపరాష్ట్రపతి పదవిని అధిరోహించిన మూడవ వ్యక్తిగా మరియు దక్షిణాది రాష్ట్రాల నుండి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ఏడవ వ్యక్తిగా రికార్డులలోనికి ఎక్కారు.
2). ఈ క్రింది ఇవ్వబడిన నలుగురిలో నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారు..?
A). రామచంద్ర పౌడెల్
B). సుశీలా కార్కి
C). పెమా ఖండు
D). అభిషేక్ సోని
జవాబు: B – సుశీలా కార్కి.
జవాబు- వివరణ:
నేపాల్ తాత్కాలిక ప్రభుత్వానికి విశ్రాంత ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ సుశీలా కార్కి నేతృత్వం వహించనున్నట్లుగా..ప్రధానిగా సుశీల కార్కి ను నియమించనున్నట్లుగా అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ తాజాగా ప్రకటించడం జరిగింది..
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సుశీల కార్కి 1975 లో భారత్ లోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం లో రాజనీతి శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ చేశారు.
అదనపు వివరణ:
బెనారస్ హిందూ విశ్వావిద్యాలయంను మదన్ మోహన్ మాలవ్య 1916 వ సంవత్సరంలో అనిబీసెంట్ సహాయంతో ఆరంభించడం జరిగింది..
ఈ యూనివర్సిటీ వారణాసి, భారతదేశంలో ఉంది.
3). ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్’ పురస్కారంను ఇటీవల ఈ క్రింది ఏ భారతీయ నటికి ప్రకటించడం జరిగింది..?
A). ఐశ్వర్యరాయ్
B). దీపిక పదుకునే
C). మాధురి దీక్షిత్
D). ప్రీతి జింటా
జవాబు: B – దీపిక పదుకునే.
జవాబు-వివరణ:
ఈ అంతర్జాతీయ గౌరవానికి ఎంపికైన తొలి నటిగా దీపిక ఘనత సాధించారు.
4). ప్రపంచ ఇంధన నివేదిక తాజా గణంకాల ప్రకారం భారత్ బయో ఇంధనములను ఉపయోగించడంలో ఈ క్రింది ఏ దేశాన్ని దాటి ప్రపంచంలో నాల్గవ అతి పెద్ద వినియోగదారుగా అవతరించినది..?
A). జపాన్
B). సింగపూర్
C). చైనా
D). అమెరికా
జవాబు: C – చైనా.
5). ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఈ క్రింది ఏ తేదీన నిర్వహించేందుకు ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తమ ఆమోదమును తెలిపింది..?
A). జూన్ 21
B). ఆగష్టు 21
C). సెప్టెంబర్ 24
D). డిసెంబర్ 21
జవాబు:. D- డిసెంబర్ 21.
6). ఈ క్రింది ఏ రెండు దేశాల మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో భారత కేంద్రప్రభుత్వం భారతీయుల క్షేమం కోసం “ఆపరేషన్ సింధు” పేరుతో ప్రత్యేక కార్యక్రమంను జూన్ 18,2025 నాడు నిర్వహించడం జరిగింది..?
A). భారత్-పాకిస్తాన్
B). భారత్- చైనా
C). ఇజ్రాయెల్-ఇరాన్
D). రష్యా-ఉక్రెయిన్
జవాబు: C – ఇజ్రాయెల్-ఇరాన్.
జవాబు-వివరణ:
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం జరుగగా.. ఇరాన్ లో చిక్కుకున్న బారతీయులను స్వదేశానికి రప్పించెందుకు కేంద్ర ప్రభుత్వం “ఆపరేషన్ సింధు” పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమంను జూన్ 18,2025 న ప్రారంభం చేయడం జరిగింది.
7). భారత్ లోనే తొలిసారిగా ఏటీఎం (ATM) సౌకర్యం కలిగిన రైలుగా ముంబై-మన్మడ్ పంచవటి ఎక్స్ ప్రెస్ నిలిచినది.. అయితే ఈ రైలులో ఎటిఎం (ATM) ను ఏర్పాటు చేసిన బ్యాంక్ ఏది..?
A). స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
B). ఇండస్ & ఇండ్ బ్యాంక్
C). పంజాబ్-సింధు బ్యాంక్
D). బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
జవాబు: D – బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.
8). ప్రపంచ వన్య ప్రాణి దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని మోదీ 2025 మార్చి 3వ తేదీన గిర్ అభయారణ్యంలో పర్యటించడం జరిగింది..అయితే ఈ గిర్ అభయారణ్యం ఈ క్రింది ఏ భారతీయ రాష్ట్రంలో కలదు..?
A). ఉత్తరప్రదేశ్
B). గుజరాత్
C). ఉత్తరా ఖండ్
D). అస్సాం
జవాబు: B – గుజరాత్.
9). 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు, జూలై 6-7,2025 తేదీలలో ఈ క్రింది ఏ ప్రదేశంలో నిర్వహించడం జరిగింది..?
A). లండన్, బ్రిటన్
B). రియో డి జనీరో, బ్రెజిల్
C). బిజింగ్, చైనా
D). న్యూ ఢిల్లీ, ఇండియా
జవాబు: B – రియో డి జనీరో, బ్రెజిల్.
జవాబు- వివరణ:
2026 వ సంవత్సరములో భారత్ బ్రిక్స్ సమావేశానికి అధ్యక్షత వహించనుంది.
10). ఇటీవల GI ట్యాగ్ పొందిన Sangri బీన్స్ ఈ క్రింది ఏ భారతీయ రాష్ట్రానికి చెందినది..?
A). రాజస్థాన్
B). తెలంగాణ
C). ఉత్తర ప్రదేశ్
D). గుజరాత్
జవాబు: A – రాజస్థాన్.
అదనపు వివరణ:
మరోకొన్ని GI ట్యాగ్ లు – సంబంధిత రాష్ట్రాలు:
తెలంగాణ – వరంగల్ చపాటా మిర్చి.
ఉత్తరప్రదేశ్ -బెనారస్ తబలా మరియా షెహానాయ్.
ఘర్చోలా చీర – గుజరాత్..
NOTE:
మీకు పైన అందించిన జనరల్ స్టడీస్ & కరెంట్ అఫైర్స్ మోడల్ బిట్స్ 2025 మీ ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల ప్రిపరేషన్ లో ఉపయోగకరంగా ఉన్నాయనిపిస్తే.. మరికొంత మంది ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు మన వెబ్సైటు www.vidyavaradhi.com ను షేర్ చేసి పరిచయం చేయగలరు..
మరియు ప్రతీ రోజు న్యూస్ పేపర్స్ లో వచ్చే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ & విద్యా మరియు ఉద్యోగ సమాచారం కోసం ఈ క్రింది వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ కాగలరు..
https://whatsapp.com/channel/0029VbAqlrdBfxo7GfkcVP30
సదా మీ విద్యా సేవలో
Sai’s విద్యా వారధి
(సాధానాత్ సాధ్యతే సర్వమ్)
. 🖊📖🖊

