Sai’s విద్యా వారధి – పరిచయం :

సదా మీ విద్యా సేవలో .. sai's విద్యా వారధి { సాధానాత్ సాధ్యతే సర్వమ్}

Sai Satish
2 Min Read
Highlights

    Sai’s విద్యా వారధి కు స్వాగతం.. శుభ స్వాగతం..

    ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములలో ఉన్న కేజీ నుండి పీజీ చదివే విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు అటు కేంద్ర ప్రభుత్వ మరియు ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న రాబోయే కాలంలో కాబోయే ప్రభుత్వ ఉద్యోగార్ధులకు అందరికీ Sai’s విద్యా వారధి తరపున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము..

    Sai’s విద్యా వారధి – పరిచయం

    www.vidyavaradhi.com అనే వెబ్సైటు ద్వారా ఇకపై ప్రతీ రోజు కేజీ నుండి పీజీ చదివే విద్యార్థులకు సంబంధించిన విద్యా సమాచారం అనగా విద్యార్థులకు సంబంధించిన వర్క్ షీట్స్, పరీక్షల తేదీలు మరియు సిలబస్ వివరాలు, స్కాలర్షిప్ అప్డేట్స్, నవోదయ మరియు NMMS పరీక్షలకు సంబంధించిన టాపిక్స్, ఇలా విద్యార్థులకు అవసరం అయిన ప్రతీ సమాచారాన్ని పై వెబ్సైటు ద్వారా మీ ముందుకు తెలుగులో తీసుకుని వచ్చేందుకు ప్రయత్నాలు ఆరంభిస్తున్నాము..

    ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC), తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ద్వారా విడుదలయ్యే గ్రూప్-1, గ్రూప్-2,గ్రూప్-3,గ్రూప్-4, దేవాదాయ ధర్మాదాయ శాఖ మొదలైన పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్ధులకు మరియు ఇరు తెలుగు రాష్ట్రాలలో డీఎస్సీ, ఎస్సై, కానిస్టేబుల్ ఇతర ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థుల ప్రిపరేషన్ కు సంబంధించిన జనరల్ స్టడీస్ అనగా డైలీ కరెంట్ అఫైర్స్, జియోగ్రఫీ, పాలిటి, చరిత్ర, ఎకనామిక్స్, జనరల్ సైన్స్, స్టాటిక్ జీకే తదితర అంశాలపై ప్రతీ రోజు మోడల్ బిట్స్ ను వాటి జవాబులను వివరణలతో సహా మీ ముందుకు తెలుగులో మన www.vidyavaradhi.com వెబ్సైటు ద్వారా మీకు అందించడం జరుగుతుంది..

    ఇవే కాకుండా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియమాలకు సంబంధించిన నోటిఫికెషన్స్ వివరాలను మీకు అర్ధమయ్యే రీతిలో తెలుగులో మన వెబ్సైటు ద్వారా అందించడం జరుగుతుంది..

    మన వెబ్సైటులో కేవలం విద్యా మరియు ఉద్యోగ సమాచారములను మాత్రమే అందించడం జరుగుతుంది.. భవిష్యత్తు రోజులలో మన వెబ్సైటు ద్వారా మీరు అందుకునే ప్రతీ పోస్టును మీ సమీపంలో ఉన్న విద్యార్థులకు మరియు ఉద్యోగార్థులకు చేరవేస్తారని ఆశిస్తూ..

    . సదా మీ సేవలో..
    . మీ
    . Sai’s విద్యా వారధి
    . {సాధనాత్ సాధ్యతే సర్వమ్}
    . 🖊📖🖊

    Share This Article
    Leave a review