ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 ఉద్యోగాల ప్రత్యేకం.. 🖊️📖🖊️

Latest current affairs 2026 in Telugu || Ap job CALENDAR-2026 PREPARATION special

Sai Satish
9 Min Read
AP JOB CALENDAR-2026 PREPARATION SPECIAL

WELCOME to OUR SAI’S VIDYAVARADHI COMPETITIVE ACADEMY.. 🖊️📖🖊️

{ ఏప్రిల్ 9,2026 }.

డైలీ జనరల్ స్టడీస్ & కరెంట్ అఫైర్స్ Top-10 బిట్స్ :

1). ఈ క్రింది ఏ శిల్ప శైలిని గ్రీకో – ఇండియన్ శైలి అనికూడా పిలుస్తారు..?

A). మధుర శైలి

B). అమరావతి శైలి

C). గాంధార శైలి

D). పైవేవి కావు

జవాబు : C – గాంధార శైలి.

వివరణ :

గ్రీకో – ఇండియన్ శైలి అని గాంధార శిల్ప కళను పిలుస్తారు.

👉 ఇది భారతీయ మరియు గ్రీకో-రోమన్ (హెలెనిస్టిక్) శైలుల కలయికతో ఏర్పడింది.

👉ఇందులో బుద్ధుని శిల్పాలను భారతీయ విషయాలతో, గ్రీకు దేవతలైన అపోలో వంటి ముఖ కవళికలతో మరియు వాస్తవిక శైలిలో చెక్కారు.

👉ఇది ప్రధానంగా వాయువ్య భారతదేశం (ఆధునిక పాకిస్థాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం) లో వర్ధిల్లింది.

👉ఈ శైలిలో బుద్ధుని విగ్రహాలు నిగూఢమైన వస్త్రధారణ, జుట్టు మరియు శిల్పాలలో సహజత్వం కలిగి ఉంటాయి.

👉దీనిని ‘గ్రీకో-బౌద్ధ కళ’ అని కూడా పిలుస్తారు.

2). “లారెంజ్ వక్ర రేఖ” ఈ క్రింది దేనిని సూచిస్తుంది..?

A). ఉపాధి

B). ద్రవ్యోల్భణం

C). ప్రతి ద్రవ్యోల్బణం

D). ఆదాయ పంపీణీ

జవాబు : D – ఆదాయ పంపిణి.

వివరణ :

👉 “లారెంజ్ వక్ర రేఖ” ఆర్థికశాస్త్రంలో ఒక దేశంలోని జనాభాలో ఆదాయం లేదా సంపద పంపిణీలో ఉండే అసమానతలను గ్రాఫ్ రూపంలో చూపే ఒక ముఖ్యమైన సాధనం.

👉ఇది జనాభాలో సంచిత శాతం మరియు వారు పొందే సంచిత ఆదాయం/సంపద శాతాన్ని గ్రాఫ్‌పై సూచిస్తుంది.

👉1905లో అమెరికన్ ఆర్థికవేత్త మాక్స్ ఓ. లారెంజ్ సంపద పంపిణీలో అసమానతను వివరించడానికి దీనిని అభివృద్ధి చేశారు.👉సంపూర్ణ సమానత్వ రేఖ గ్రాఫ్‌లో 45 డిగ్రీల సరళ రేఖ సంపూర్ణ సమానత్వాన్ని సూచిస్తుంది (అంటే అందరికీ సమాన ఆదాయం ఉండటం).

👉లారెంజ్ వక్రరేఖ, ఈ 45 డిగ్రీల రేఖకు ఎంత దూరంలో (క్రిందకు) ఉంటే, ఆ దేశంలో ఆదాయ అసమానతలు అంత ఎక్కువగా ఉన్నాయని అర్థం.

👉గిని కోఎఫీషియంట్ లారెంజ్ వక్రరేఖ ఆధారంగా గిని కోఎఫీషియంట్‌ను లెక్కిస్తారు, ఇది అసమానతను సంఖ్యాత్మకంగా (0 నుండి 1 వరకు) కొలుస్తుంది.

👉క్లుప్తంగా చెప్పాలంటే, ఒక సమాజంలో ధనిక, పేద వర్గాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ వక్రరేఖ స్పష్టంగా చూపుతుంది.

3).అశోకుడు బౌద్ధ మత వ్యాప్తి కొరకు మహేంద్ర, సంఘమిత్రలను ఏ ప్రదేశానికి పంపాడు..?

A). ఆసియా

B). ఇరాన్

C). జావా

D). శ్రీలంక

జవాబు : D – శ్రీలంక.

వివరణ :

👉 అశోకుడు బౌద్ధ మత వ్యాప్తి కొరకు తన కుమారుడైన మహేంద్రుడిని (మహింద), కుమార్తె సంఘమిత్రను శ్రీలంక (అప్పటి పేరు సిలోన్) కు పంపాడు.

👉 శ్రీలంకలో బౌద్ధమతాన్ని, ముఖ్యంగా థేరవాద బౌద్ధమతాన్ని వ్యాప్తి చేయడం.

👉సంఘమిత్ర, గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన పవిత్రమైన బోధి వృక్షం యొక్క శాఖను కూడా శ్రీలంకలోని అనురాధపురానికి తీసుకువెళ్ళారు.

👉అప్పట్లో శ్రీలంకను పరిపాలిస్తున్న దేవనంపియ తిస్సా అభ్యర్థన మేరకు వీరిని పంపారు.

4).భారతదేశంలో ఎవరిని శస్త్ర చికిత్స పితామహుడు (FATHER OF SURGERIES) అనీ పిలుస్తారు..?

A). విష్ణుశర్మ

B). అమరసింహ

C).పాణిని

D). సుశ్రుతుడు

జవాబు : D – సుశ్రుతుడు.

వివరణ :

👉క్రీ.పూ 6వ లేదా 7వ శతాబ్దానికి చెందిన ప్రాచీన భారతీయ వైద్యుడు, సర్జన్.

👉 ఆయన రచించిన “సుశ్రుత సంహిత” (Sushruta Samhita) ఆయుర్వేదంలో శస్త్రచికిత్సకు సంబంధించిన అత్యంత ప్రామాణిక గ్రంథం.

👉ఆయన ప్లాస్టిక్ సర్జరీ, కంటిశుక్లం (Cataract) సర్జరీ వంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలను వేల సంవత్సరాల క్రితమే నిర్వహించారు.

👉ముక్కు పునర్నిర్మాణ సర్జరీ (Rhinoplasty) లో ఆయన చేసిన కృషికి గాను, ఆయనను “ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు” అని కూడా పిలుస్తారు.

👉ఆయన వారణాసి (కాశీ) లో వైద్య విద్యను బోధించారు.

👉ఆధునిక శస్త్రచికిత్సలకు పునాది వేసిన వారిలో సుశ్రుతుడు మొదటివాడిగా పరిగణించబడతాడు.

5).హర్షుని కాలంలో దొంగతనాలు ఎక్కువగా ఉండేవాని తననే దోచుకున్నారని ఈ క్రింది ఏ చరిత్రకారుడు తెలిపాడు..?

A). ఇత్సింగ్

B). హ్యూయాన్ త్సాంగ్

C). అమిర్ ఖుస్రో

D). మెగస్తనీస్

జవాబు : B – హ్యూయాన్ త్సాంగ్.

వివరణ :

👉హ్యూయెన్ త్సాంగ్ చైనాకు చెందిన బౌద్ధ యాత్రికుడు.హర్షవర్ధనుడి పాలనా కాలంలో (క్రీ.శ. 7వ శతాబ్దం) ఈయన భారతదేశాన్ని సందర్శించి, హర్షుని కాలంనాటి పరిస్థితులపై ‘సి-యు-కి’ (Si-Yu-Ki) అనే గ్రంథాన్ని రాశారు.

👉తన యాత్రలో, ముఖ్యంగా మధుర మరియు కనౌజ్ పరిసర ప్రాంతాలలో దొంగల భయం ఎక్కువగా ఉండేదని, తను కూడా దొంగల బారిన పడ్డానని ఆయన తన రాతల్లో వివరించారు.

👉ఈ దొంగతనాలు జరిగినప్పటికీ, హర్షవర్ధనుడి పరిపాలనలో ప్రజలు సాధారణంగా సంతోషంగానే ఉండేవారని మరియు చట్టాన్ని కఠినంగా అమలు చేసేవారని ఆయన పేర్కొన్నారు.

6). భారతదేశ రామచిలుక (ప్యారెట్ ఆఫ్ ఇండియా) అని ఎవరిని పిలుస్తారు..?

A).అమీర్ ఖుస్రో

B). ఆర్యభట్ట

C). నాగార్జున

D). కాళిదాసు

జవాబు : A – అమీర్ ఖుస్రో.

వివరణ :

👉అమీర్ ఖుస్రో 13వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ సూఫీ కవి, గాయకుడు మరియు పండితుడు.

👉ఆయన తన సాహిత్య సేవకు, మాతృభూమి పట్ల ఉన్న ప్రేమకు మరియు పర్షియన్, హిందీ భాషలలో ఉన్న అద్భుతమైన వాక్చాతుర్యానికి గాను, ‘భారతదేశ చిలుక’ అనే బిరుదును పొందారు.

👉ఆయనను అలావుద్దీన్ ఖల్జీ “తూతీ-ఇ-హింద్” (భారతదేశపు చిలుక) అని గౌరవించారు.

NOTE :

సలీం అలీని “బర్డ్‌మ్యాన్ ఆఫ్ ఇండియా” (Birdman of India) అని పిలుస్తారు.,

కానీ ‘ప్యారెట్ ఆఫ్ ఇండియా’ (Parrot of India) అని అమీర్ ఖుస్రోను పిలుస్తారు.

7). తమిళనాడు సముద్ర తీరాన్ని ఏమని పిలుస్తారు..?

A). సర్కార్ తీరం

B). కొంకణ్ తీరం

C). మలబార్ తీరం

D). కోరమండల్ తీరం

జవాబు : D – కోరమండల్ తీరం.

వివరణ :

తమిళనాడు సముద్ర తీరాన్ని కోరమాండల్ తీరం (Coromandel Coast) అని పిలుస్తారు.

👉 ఇది దక్షిణ భారతదేశంలోని తూర్పు తీరంలో, బంగాళాఖాతం వెంబడి విస్తరించి ఉంది.

👉 కన్యాకుమారి వద్ద తమిళనాడు తీరం మూడు జలరాశులను (బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం మరియు అరేబియా సముద్రం) తాకుతుంది.

👉ఇది సుమారు 1076 కిలోమీటర్ల పొడవుతో, గుజరాత్ తర్వాత భారతదేశంలోనే రెండవ అతి పొడవైన తీరప్రాంతంగా ఉంది.

👉మెరీనా బీచ్ (చెన్నై), మామల్లాపురం (మహాబలిపురం) వంటివి ఈ తీరంలోని ముఖ్యమైన ప్రదేశాలు.

8). భారతదేశంలో కాఫీను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది..?

A). మహారాష్ట్ర

B). కేరళ

C). ఒడిశా

D). కర్ణాటక

జవాబు : D – కర్ణాటక.

వివరణ :

👉భారతదేశంలో కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం కర్ణాటక. ఇది దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం కాఫీలో సుమారు 70% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది, ముఖ్యంగా చిక్కమగళూరు, కొడగు మరియు హాసన్ జిల్లాల్లో కాఫీ ఎక్కువగా పండుతుంది. కర్ణాటక తర్వాత కేరళ, తమిళనాడు రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

👉 కర్ణాటక (సుమారు 70% కంటే ఎక్కువ ఉత్పత్తి).కాఫీ రకాలు: రోబస్టా మరియు అరబికా.ప్రధాన ప్రాంతాలు: చిక్కమగళూరు, కొడగు, హాసన్.ఇతర ఉత్పత్తిదారులు: కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్.

👉 కర్ణాటకలోని కొడగు (కూర్గ్ ) జిల్లా భారతదేశంలోనే అత్యధికంగా కాఫీ ఉత్పత్తి చేసే ప్రాంతంగా పేరుగాంచింది.

9). 23వ బయో ఆసియా వార్షిక అంతర్జాతీయ సదస్సు 2026 ఫిబ్రవరి 17,18 వ తేదీల్లో ఏ భారతీయ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది..?

A). కర్ణాటక

B). మధ్యప్రదేశ్

C). తెలంగాణ

D). గుజరాత్

జవాబు : C – తెలంగాణ.

వివరణ :

ఈ సదస్సు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ లోని హెచ్‌ఐసీసీ (Hyderabad International Convention Centre – HICC) మరియు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా జరిగింది.

🌟 థీమ్: “టెక్ బయో అన్‌లీష్డ్: AI, ఆటోమేషన్ & ది బయాలజీ రివల్యూషన్”

(TechBio Unleashed: AI, Automation & the Biology Revolution).

👉 తెలంగాణ ప్రభుత్వం, ఆసియాలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ మరియు హెల్త్‌కేర్ ఫోరమ్‌గా దీనిని నిర్వహించింది.

👉 ఈ సదస్సును తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

👉50కు పైగా దేశాల నుండి ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

10).ఫిబ్రవరి 13,2026 లో భారతదేశ రాజధాని ఢిల్లీ లో ప్రధానమంత్రి కార్యాలయం (PMO) నూతన భవనం “సేవా తీర్ధ్”.. భవనంలో తొలి రోజు అధికారిక విధులు ప్రారంభించిన భారత ప్రధాని మోదీ ఈ క్రింది ఏ పధకానికి అనుమతి ఇస్తూ ఫైల్ పై సంతకం చేశారు..?

A). పీఎం సంక్షేమ్

B). పీఎం గ్రామీణ సురక్ష

C). పీఎం రాహత్

D). పీఎం సురక్ష యోజన

జవాబు : C – పీఎం రాహత్.

వివరణ :

👉 పీఎం రాహత్ (PM RAHAT – Prime Minister’s Road Accident Victim Hospitalisation and Assured Treatment) పథకం రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక విప్లవాత్మకమైన కార్యక్రమం.

👉ఈ పథకం కింద, ప్రమాదం జరిగిన మొదటి 7 రోజుల వరకు, రూ. 1.5 లక్షల వరకు నగదు రహిత (Cashless) ఉచిత చికిత్సను బాధితులు పొందవచ్చు.

మిత్రులందరికీ ముఖ్యమైన గమనిక :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ జాబ్ క్యాలెండర్ – 2026 లో భాగంగా రాబోయే ప్రభుత్వ ఉద్యోగాలలో మీరు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా..? అయితే పై ముఖ్యమైన బిట్స్ మీ కోసమే ప్రత్యేకంగా రూపొందిస్తున్నాము..పోటీ పరీక్షలలో ప్రతి ఒక్క మార్కు విలువైనదే.. అటువంటి విలువైన మార్కులను మీకు అందించాలనే ఉద్దేశ్యంతో మీకు ఈ top-10 జనరల్ స్టడీస్ & కరెంట్ అఫైర్స్ బిట్స్ ను జవాబు వివరణలతో సహా మీకు కేవలం.. ప్రస్తుతం మీ అందరి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. ఈ రోజు నుండి..ప్రతీరోజు ఒక్క రూపాయికే అనగా కేవలం నెలకు 30 రూపాయలకు 300 బిట్స్ ను జవాబుల వివరణలతో సహా మీకు అందించడం జరుగుతుంది..30 రూపాయలకే 300 విలువైన బిట్స్ ను మీరు కూడా ప్రతీ రోజు మీ వాట్సాప్ ద్వారా అందుకోవాలని అనుకుంటే 7013252312 ఫోన్ పే నెంబర్ కు 30 రూపాయలను అమౌంట్ సెండ్ చేసి.. స్క్రీన్ షాట్ పంపిస్తే మీకు ప్రతీ రోజు Top10 జనరల్ స్టడీస్ & కరెంట్ అఫైర్స్ పిడిఎఫ్ ఫైల్ ను మీ వాట్సాప్ కు పంపించడం జరుగుతుంది..

ఇట్లు.,

సదా మీ విజయాన్ని మనస్ఫూర్తిగా ఆకాంక్షించే.

Sai’s VidyaVaradhi COMPETITIVE ACADEMY

(సాధనాత్ సాధ్యతే సర్వమ్)

🖊️📖🖊️

Share This Article
Leave a review